
AP Free Gas: ఏపీలో ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు.. జస్ట్ ఈ రెండు ఉంటే చాలు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం దీపావళి ధమాకా వార్త చెప్పింది. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ పథకం బుకింగ్స్ ప్రారంభమవుతందన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని అన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండి… తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబం అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు.